ఘనంగా ఆజాదీ కా అమృత్ మ హోత్సవం..

0
6

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా75 వ స్వాతంత్ర ఉత్సవంలో భాగంగా ఉత్సవలు చేస్తూ ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి అనే సంకల్పంతో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్యర్యంలో ఒంగోలు నగరంలోని st,. థ్రిస్సా స్కూల్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమనికి స్కూల్ హెడ్ మాస్టర్ బి.ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా .ముఖ్యఅతిథిగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్. ఖలీఫాతుల్లాబాషా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర సముపార్జనలో పోరాడిన త్యాగధనుల జీవితాన్ని నేటి తరానికి తెలియజేసి దేశ భక్తి , జాతీయ వాదాన్ని యువతలో పెంపొందించాలిసిన అవసరన్నీ గ్రహించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ను గౌరవిస్తూ దేశం మొత్తం ఆగస్టు 1 నుంచి 15 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవలు జరుపుకుంటు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పై జాతీయ జెండా ఎగురవేసి 75 వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను జరుపుకుని దేశ భక్తి ని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి ప్రెసిడెంట్ శ్రీమతి. మన్నెం ఉషా,హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ ప్రోటాక్షన్ ఏపి ప్రెసిడెంట్ శ్రీమతి.జ్ఞాన సుందరి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విశ్వనాధపల్లి వెంకటేశ్వరరావు,హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ntr జిల్లా ప్రెసిడెంట్ జి.కల్పన తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here