కందుకూరు నియోజకవర్గం పరిధిలోని తెలుగుమహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుమహిళా కమిటీ అధ్యక్షురాలు దివి సౌభాగ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుమహిళ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పులిమి శైలజ రెడ్డి , నెల్లూరు పార్లమెంటు
తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి విజయ , కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు హాజరై కందుకూరు నియోజకవర్గ మహిళా కమిటీతో పాటు 5 మండలాలు మరియు పట్టణ మహిళా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ అధ్యక్ష , ప్రధానకార్యదర్శి దివి సౌభాగ్య , అల్లం సుమతి , కందుకూరు పట్టణ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి ముచ్చు లక్ష్మీ రాజ్యం , కల్లూరి శైలజ , కందుకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మన్నం శైలజ , బొందు స్రవంతి , వలేటివారిపాలెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గురిజాల అంతోనమ్మ , స్వర్ణ రజనీ , లింగసముద్రం మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శి బొజ్జ విజయమ్మ , చాగంటి చెంచులక్ష్మీ , ఉలవపాడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సన్నిబోయిన ప్రభావతి , కత్తి లక్ష్మీ కుమారి , గుడ్లూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ రమణమ్మ , గుండ్లాపల్లి రత్తమ్మలతో పాటుగా మిగిలిన కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు.అనంతరం శైలజారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంకోసం మహిళలు బాగా కష్టపడి పనిచేయాలని పిలుపు నిచ్చారు. మహిళల శక్తి ఏమిటో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రుచి చూపించాలని కోరారు.