ఘనంగా శిద్దా రాఘవరావు పుట్టినరోజు వేడుకలు…

0
10

పుట్టినరోజు వేడుకలలో ముఖ్య అతిథిగా బాలినేని శ్రీనివాసరెడ్డి.

వేడుకలలో కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బాలినేని.

అభిమానుల కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు.

కుటుంబ సభ్యులతో కలసి అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన శిద్దా రాఘవరావు.

మాజీమంత్రి ,వైసీపీ నాయకులు శిద్దా రాఘవరావు పుట్టినరోజు వేడుకలు ఒంగోలు ,చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో బుధవారం ఘనంగా జరిగాయి.మాజీమంత్రి శిద్దా రాఘవరావు పుట్టినరోజు వేడుకలకు,మాజీమంత్రి, ఒంగోలు ఎమ్.ఎల్.ఏ,రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని శిద్దా రాఘవరావు కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జ్యోతి గ్రానైట్ ఇండియా ఎక్సపోర్ట్స్ సి.ఓఓ. శివరామ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను బాలినేని శ్రీనివాసరెడ్డి,శిద్దా సుధీర్ తో కలసి శిద్దా రాఘవరావు దంపతులు కట్ చేశారు.శిద్దా రాఘవరావు కు బాలినేని శ్రీనివాసరెడ్డి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, శిద్దా రాఘవరావు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రకాశంజిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శిద్దా రాఘవరావు పుట్టినరోజు వేడుకలకు ఘనంగా నిర్వహించారు. మేయర్ గంగడ సుజాత, రవి ప్రియ మాల్ కంది రవి శంకర్, నగర వైసీపీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, తాత ప్రసాద్, వైసీపీ నాయకులు కటారి శంకర్,గంటా రామానాయుడు,కార్పొరేటర్ ఆదిపూడి శాండిల్య,,ఒంగోలు నగర మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కనమర్లపూడి హరి ప్రసాద్,జలదంకి కృష్ణారావు,చక్క చెన్న కేశవ, రావిపూడి లక్ష్మీనారాయణ, తదితరులు శిద్దా రాఘవరావు గారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.బల్లికురవ లక్ష్మి గ్రానైట్ మేనజర్ ఉప్పుటూరి కృష్ణారావు,శిద్దా రాఘవరావు గారి కార్యాలయ ఆడిటర్ అద్దంకి మురళి కృష్ణ,అద్దంకి కృష్ణ ప్రసాద్ శిద్దా రాఘవరావు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారి కేక్ ను శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధీర్ కుమార్ కట్ చేశారు.అనంతరం శిద్దా రాఘవరావు కార్యాలయ వ్యక్తిగత కార్యదర్శి గుమ్మా హనుమంతరావు, బెజవాడ నరేంద్ర కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ ను శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధీర్ కుమార్ కట్ చేసారు.ఆత్మీయుల కోలాహలం నడుమ చిమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా జరిగిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు పుట్టినరోజు వేడుకలు.

గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ ఏ.గిరి ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు:

అభిమాన నాయకుడికి షిర్డీ నుండి ప్రత్యేకంగా తెప్పించిన గంధపు మాల తో సత్కార్యం, పుట్టిన రోజు వేడుకలలో సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన గోల్డెన్ గ్రానైట్ ఏ.గిరి తదితరులు.

మాజీమంత్రి శిద్దా రాఘవరావు పుట్టినరోజు వేడుకలు శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఇంచార్జ్ ఎమ్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పుట్టినరోజు ఏర్పాట్లు మిన్నంటాయి.తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.శిద్దా రాఘవరావు దంపతులకు,శిద్దా సుధీర్ కుమార్ లకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభం,మంగళ వాయిద్యాల తో స్వాగతం పలికారు.అనంతరం అనంతరం శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధీర్ కుమార్ క్షేత్రంలో వేంచేసి ఉన్న సకల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గోల్డెన్ గ్రానైట్ ఏ.గిరి ఆధ్వర్యంలో ఆలయ ఇంచార్జ్ ఎమ్.వెంకటేశ్వర్లు,వెలుగువారి పాలెం సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను శిద్దా రాఘవరావు దంపతులు కట్ చేశారు.షిర్డీ నుండి ప్రత్యేకంగా తెప్పించిన గంధపు మాలను ఏ గిరి ఆధ్వర్యంలో శిద్దా రాఘవరావు దంపతులకు విశేష ఆకర్షణగా నిలిచింది.ఎమ్.వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, లక్ష్మణ్ ఆధ్వర్యంలో శిద్దా రాఘవరావు దంపతులకు పూల కిరీటం బహుకరించి తమ అభిమానం చాటుకున్నారు.

సేవా కార్యక్రమాలు సంతృప్తిని కలిగించాయి శిద్దా రాఘవరావు వెల్లడి:

మాజీమంత్రి శిద్దా రాఘవరావు పుట్టినరోజు సందర్భంగా గోల్డెన్ గ్రానైట్ ఏ.గిరి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు అందరి మన్ననలు పొందాయి. చిమకుర్తి పరిసర ప్రాంతాలకి చెందిన ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థులు సుమారు 1000 మందికి నోట్ బుక్స్ ను శిద్దా రాఘవరావు విద్యార్థులకు అందచేసి మానవత్వం చాటుకున్నారు.అంతే కాకుండా చిమకుర్తి కి చెందిన ఎస్.కె.ఆర్ బధిరధుల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ అందచేసి తమ దయా గుణాన్ని మరో సారి చాటుకున్నారు.అభిమానుల ఆత్మీయ శుభాకాంక్షలు సందర్భంగా చిమకుర్తి హరిహర క్షేత్రం సందడిగా మారింది.చిమకుర్తి పట్టణానికి చెందిన ప్రముఖులు,వాసవి ఆర్యవైశ్య సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు,గౌరవ అధ్యక్షులు శిద్దా నాగేశ్వరరావు శిద్దా రాఘవరావు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి కిరణ్, బల్లికురవ లక్ష్మీ గ్రానైట్ మేనేజర్ ఉప్పుటూరి కృష్ణ రావు,లోహిత్,షేక్ గౌస్, సాయి బాబు,రావిపూడి లక్ష్మి నారాయణ,ట్రాన్స్కో ఎస్.ఇ సత్యనారాయణ, పలువురు అభిమానులు, కరి పూర్ణ చంద్,,గ్రంధి కిరణ్,శ్రీహరి,సి.ఐ. రాఘవేంద్ర,డా.జవహర్,చలువాది బదరి నారాయణ,కందిమళ్ల గంగాధర్,శిద్దా హనుమంతరావు, శిద్దా సాయి బాబు,శిద్దా పెద్ద బాబు,చలువాది రమేష్,చిమకుర్తి రోటరీ క్లబ్,లయన్స్ క్లబ్,గ్రానైట్ రంగాలకు చెందిన ప్రముఖులు,దర్శి మందాడి సుబ్బారావు, ఎడపల్లి రామబ్రహ్మం, బుల్లబ్బాయి,మణికంఠ,వెలుగు వారి పాలెం సుబ్బారావు,బొగ్గవరపు సుబ్బారావు, అచ్యుత ప్రకాష్, కొల్లా భాస్కర్,సంకా కృష్ణ మూర్తి,అంజిరెడ్డి, మోహన్,దర్శి గౌతమి స్కూల్స్ చైర్మన్ కేశవ రెడ్డి,గ్రంధి కార్తీక్, నూనె హేమంత్,గ్రంధి శ్రీహరి,వాసవి ఆర్యవైశ్య మహిళలు,వాసవి,గోల్డెన్ గ్రానైట్ సిబ్బంది, యాతం శ్రీనివాస రెడ్డి,కొమ్ము రవిచంద్ర, నూనె సుబ్రహ్మణ్యం, నూనె శివ సుబ్రహ్మణ్యం, శిద్దా కాశీ దర్శి, ముండ్లమూరు, కురిచేడు,దొనకొండ, కందుకూరు, మార్కాపురం, తాళ్లూరు,చిమకుర్తి కి చెందిన అభిమానులు పుట్టినరోజు వేడుకలలో పాల్గొని శిద్దా రాఘవరావు కు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here