చంద్రబాబుపై అంబటి సెటైర్లు..

0
9

వరదపై బురద రాజకీయాలు.. జీవితాంతం రోడ్డుపై తిరగడమే.. చంద్రబాబుపై అంబటి సెటైర్లు

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి సెటైర్లు, విమర్శలు గుప్పించారు. పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న చంద్రబాబు.. గోదావరి వరదలపై బురద రాజకీయాలు చేస్తున్నారంటూ తనదైన శైలిలో విమర్శించారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం చేసిన సాయం, సహాయ చర్యలను చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని.. ఇక జీవితాంతం రోడ్డుపై తిరగడమేనంటూ ఎద్దేవా చేశారు.

పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరాన్ని పూర్తి చేసి, బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి సైకిల్‌కు అధికారం ఇవ్వాలంటూ చంద్రబాబు కోరారు. వరదల సమయంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని.. తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడ్డారంటూ అధికారులు, నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన కామెంట్స్‌కి అంబటి రాంబాబు కౌంటర్ అటాక్ ఇచ్చారు. పరామర్శల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ప్రభుత్వం అందించిన సాయం చూడలేక చంద్రబాబు రగిలిపోతున్నారని అంబటి మండిపడ్డారు. వరదల సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని.. వరద సాయం చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రే ప్రజల వద్దకు వెళ్లారని మంత్రి గుర్తు చేశారు.

కానీ, చంద్రబాబు వీటన్నింటిని ఓర్వలేక పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 1983లో భద్రాచలంలో కరకట్ట కట్టారని చంద్రబాబు చెబుతున్నారని.. ఆ సమయంలో అసలు టీడీపీలో ఆయన ఉన్నారా అంటూ ప్రశ్నించారు. టీడీపీకి రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని.. ఇక జీవితాంతం చంద్రబాబు రోడ్లపై తిరగడమేనంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here