చనిపోయిన వ్యక్తి తిరిగి ప్రత్యక్షం..

0
2

ప్రకాశంజిల్లాలోని ముండ్లపా డు ప్రాంతంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడు. దహన సంస్కారాలు సైతం నిర్వహించారు. కర్మకాండలు కూడా పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. సదరు వ్యక్తి చనిపోయిన విషయాన్ని అటు పోలీసు వర్గాలతో పాటు ఇటు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అంతలోపే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షం కావడంతో పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు గ్రామస్తులంతా నివ్వరపోతున్నారు.ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతుంది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ మియా (60) కు గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేక అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి ఇంటికి వస్తుంటాడు.ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సయ్యద్ మియా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉంటాడని అనుకున్నారు.

40 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన వ్యక్తి సయ్యద్ మియాకు బాగా దగ్గరి పోలికలు ఉండడంతో కుటుంబ సభ్యులు సయ్యద్ మియానే చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. పోలీసులు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించారు. సయ్యద్ మియా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకువచ్చి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.రేపటికి 40 రోజులు పూర్తి చేసుకోవడంతో దినం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.బంధువులకు వారికి వీరికి భోజనానికి రావాలని సమాచారం ఇచ్చారు.

ఇలా ఏర్పాట్లలో ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా షాక్ తగిలింది.చనిపోయాడు అనుకున్నా సయ్యద్ మియా ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్తులయ్యారు.వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హైదరాబాదులో ఉన్న సయ్యద్ మీయాను వారి బంధువులు గుర్తించి సయ్యద్ మియా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. చనిపోయాడు అని అనుకున్న మనిషి తిరిగి రావడంతో గ్రామస్తులు కూడా ఆశ్చర్యచికతులయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here