చరిత్రలో ఇదే తొలిసారి(WHO) !

0
4

 ఆ వ్యక్తికి ఒకేసారి కొవిడ్, మంకీపాక్స్- చరిత్రలో ఇదే తొలిసారి!

 కరోనా వైరస్‌ తో కలవరపడుతోన్న ప్రపంచ దేశాలను మంకీపాక్స్ గడగడలాడిస్తోంది. తాజాగా మంకీపాక్స్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర స్థితిని ప్రకటించింది. అయితే ఇలాంటి సమయంలో కరోనా సోకిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చింది. ఇలా జరగడం ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు.

అమెరికాలో

అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్‌ చివరి వారంలో కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతోన్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, ఎరుపు రంగులో పొక్కులు రావడం మొదలైంది. దీంతో అనుమానించిన ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాడు.

పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్‌ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఇలా రెండు వైరస్‌లు ఒకేసారి సోకడం చాలా అరుదైన కేసు అని వీటిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అమెరికా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here