చిన్నారిపై దాడిచేసిన చిరుతపులి ఇదే

0
3

ముంబై: ఏడాదిన్నర చిన్నారిపై దాడిచేసి ఆమె మరణానికి కారణమైన చిరుతపులి ఎట్టకేలకు పట్టుబడింది. చిన్నారిపై దాడి అనంతరం గాలింపు చేపట్టిన అటవీ శాఖ అధికారులకు ఇవాళ ఉదయం చిరుతపులి చిక్కింది. ఆ చిరుతను అధికారులు బొరివాలిలోని సంజయ్‌గాంధీ నేషనల్‌ పార్కుకు తరలించారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గోరెగావ్‌ ఏరియా ఆరే కాలనీలో మంగళవారం ఉదయం తన తల్లితో కలిసి గుడికి వెళ్తున్న ఏడాదిన్నర చిన్నారిపై ఆకస్మాత్తుగా చిరుతపులి దాడిచేసి పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here