చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్..

0
5

జనగామ జిల్లాలో దారుణం..

జనగామ జిల్లాలో ఓ చైన్ స్నాచర్ దుర్మార్గానికి పాల్పడ్డాడు. చైన్ దొంగిలించే క్రమంలో మహిళ చేతిలోని చంటిబిడ్డను నీటి సంపులోకి విసిరేశాడు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

జనగామ జిల్లా అంబేడ్కర్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ చైన్ స్నాచర్ చేతిలో పది నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా నివసించే ప్రసన్న అనే మహిళ తన పాపను ఎత్తుకొని రోడ్డుమీద వెళ్తుండగా బైక్ వచ్చిన దొంగ మెడలోని గొలుసు లాగేందుకు యత్నించాడు. ఆ మహిళ అడ్డుకోవడంతో గొలుసు తెగి ఆమె చేతిలోనే పడింది. ప్రసన్న తీవ్రంగా ప్రటిఘటించడంతో దిక్కుతోచని ఆ దొంగ.. చేతిలోని చిన్నారిని లాక్కుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి పరారయ్యాడు.

దీంతో ప్రసన్న కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి సంపులో నుంచి చిన్నారికి బయటకు తీశారు. అప్పటికే పాప మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసన్నపై నిజంగానే చైన్ స్నాచర్ దాడి చేశాడా? లేక ఆమె అబద్ధం చెబుతోందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భార్యభర్తల మధ్య విబేధాలతో ఆమె కన్నబిడ్డను హతమార్చి నాటకమాడుతోందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చిన్నారి తల్లిని పలు కోణాల్లో విచారిస్తున్నారు. చైన్ స్నాచర్ దాడికి సంబంధించి సమీపంలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here