చీకోటి ప్రవీణ్ సంచలన ప్రకటన .. నాకు ప్రాణహని  ఉంది……?

0
6

Chikoti Praveen : క్యాసినో వ్యవహారంలో మూడో రోజు విచారించింది ఈడీ. ప్రధానంగా హవాలా లావాదేవీల విషయంలోనే ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డితో పాటు ప్రవీణ్ అనుచరుడు సంపత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

  • ఇప్పటికే వీరి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన అధికారులు..ఫెమా ఉల్లంఘనలపై ప్రశ్నించారు.
  • సినీ తారాల పారితోషికాలు, ప్రత్యేక విమానాల్లో తరలింపు, ఛార్టర్డ్‌ ఫ్లైట్ల గురించి ఆరా తీశారు. బ్యాంకు లావాదేవీల వివరాలతో పోల్చుతూ ప్రవీణ్ బృందం చెప్పే సమాధానాలను సరి చూసుకున్నారు. ప్రవీణ్‌కు సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో సంపత్‌ కీలకంగా వ్యవహరించడంతో వారిద్దరు చెప్పే సమాధానాలను పోల్చారు. క్యాసినోల నిర్వహణ ద్వారా కూడబెట్టిన సొమ్మును ఏ మార్గంలో తరలించారనే విషయాన్ని విచారించారు.
  • మరోవైపు చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ప్రవీణ్ లావాదేవీల వివరాలను ఈడీ ఇప్పటికే ఐటీ శాఖకు అందించిట్లు తెలుస్తోంది. ప్రవీణ్ బర్త్‌ డే వేడుకలతో పాటు ఇతర కార్యక్రమాల్లో డబ్బు మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడంతో పాటు అతడి ఆడంబర జీవితానికి సంబంధించిన పలు అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
  • ప్రవీణ్ కొన్నేళ్లుగా గోవాలో క్యాసినోల నిర్వహణ ద్వారా భారీగా కమిషన్లు కూడబెట్టడంతో పాటు విదేశాల్లోనూ పెద్ద ఎత్తున పంటర్లను సమీకరించి జూదమాడించిన విషయంపై ఐటీ శాఖ దృష్టి పెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ సేకరించే సమాచారం ఆధారంగా ఐటీ శాఖ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • బుధవారం రాత్రి ఈడీ విచారణ అనంతరం చీకోటి ప్రవీణ్ సంచలన ప్రకటన చేశాడు. తనకు ప్రాణహని ఉందని చెప్పాడు. నేను క్యాసినోకి రమ్మని ఎవరిని పిలవలేదని…వాళ్ల ఇష్టంతోనే ఆడారని చెప్పాడు. చాలా మంది తనను సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అన్ని అనుమతులతోనే ఫామ్‌ హౌస్‌లో జంతువులను పెంచుతున్నట్లు చెప్పాడు. ఈడీ అధికారులు పిలిస్తే ఎప్పుడు రావడానికైనా సిద్ధమేనన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here