చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా శ్రీ.వరలక్ష్మి వ్రత వేడుకలు.

0
4

విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించిన శిద్దా లక్ష్మీ పద్మావతి

పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు.

శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలు శ్రీ హరిహర క్షేత్రంలో అంగరంగ వైభోగంగా నిర్వహించారు. మాజీమంత్రి శిద్దా రాఘవరావు సతీమణి శ్రీమతి లక్ష్మీ పద్మావతి వాసవి మహిళలతో కలసి శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ చక్ర సహిత సామూహిక కుంకుమ అర్చనలు.నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష అలంకారాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది మహిళల భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశిస్సులు అందుకున్నారు.శ్రీమతి లక్ష్మీ పద్మావతి అమ్మవారి పసుపు కుంకుమ,చీరలు సమర్పించి అమ్మవారి ఆశిస్సులు అందుకున్నారు.సాయంత్రం లక్ష్మీ పద్మావతి మహిళా భక్తులతో కలసి శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక శ్రీ లలిత సహస్ర నామ పారాయణం,హనుమాన్ చాలిశా పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ మతి లక్ష్మీ పద్మావతి ఆధ్వర్యంలో సామూహిక పారాయణంలో పాల్గొన్న ముత్తైదువులకు చీరలు,పసుపు,కుంకుమతో వాయినాలు స్వయంగా అందచేసారు.మహిళా భక్తులకు శిద్దా వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు,అల్పాహారం ఏర్పాటు చేశారు.ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ,హరి కుమారా చార్యులు,శ్రీనివాసా చార్యులు, వేంకటేశ్వరాచార్యులు హరికృష్ణ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు.ఆలయ ఇంచార్జ్ ఎమ్.వెంకటేశ్వర్లు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here