చెట్టుపై వెలసిన ప్రకృతి వినాయకుడు..

0
5
వైజాగ్ చెట్టుపై వినాయకుడి ఆకారం. పూజలు చేస్తున్న మహిళలు.. రాబోయే వినాయచవితికి మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్టించాలని కోరుతున్నారు. స్థానికులు వినాయకుడ్ని చూసేందుకు వస్తున్నారు.

విశాఖపట్నంలోని సింహాచలం పాత గోశాల వద్ద ప్రకృతి సిద్ధంగా తయారైన వినాయకుడు మహిళలను ఆకర్షిస్తున్నాడు. ఆ ప్రకృతి వినాయకుడికి అక్కడి మహిళలు పూజలు చేస్తున్నారు. సింహాచలం పాత గోశాల వద్ద చెట్టుపైకి తీగలతో మొక్క వ్యాపించింది. ఈ తీగ మొక్క వినాయకుడి ఆకారంలో కనిపిస్తోంది. దీంతో స్థానిక మహిళలు దానిని విఘ్నేశ్వరుడి మహిమగా భావించి పూజలు చేస్తున్నారు. చెట్టు దూరంగా ఉండటంతో కింద ఒక బల్ల వేసి.. అక్కడే కొబ్బరికాయలు కొట్టి పండ్లు నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తున్నారు.

ఈ ప్రకృతి వినాయకుడిని తామొక సందేశంగా భావిస్తున్నామని స్థానిక మహిళలు చెబుతున్నారు. రాబోయే వినాయక చవితికి ప్రతి ఒక్కరూ ప్లాసర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు కాకుండా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని కోరుతున్నారు. ఇదే సందేశాన్ని ప్రకృతి సిద్ధంగా చెట్టుపై వెలసిన వినాయకుడు తమకు ఇస్తున్నాడని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వినాయకుడిని చూసేందుకు భారీగా అక్కడికి తరలివస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here