చెత్త పన్ను చెల్లించకపోతే కార్మికులకు జీతాలు లేవు

0
8
 • విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల ఆదేశాలు
 • ఆగస్టు వరకు చెత్త పన్ను చెల్లించినట్లు రసీదులు సమర్పించకపోతే వేతనాలు నిలిపివేత
 • కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ ఉద్యోగులకు హెచ్చరిక
 • ఖజానా నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడటం శోచనీయం
 • కేంద్రం మెప్పుకోసం, ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం బరితెగించడం అన్యాయం
 • కార్మిక చట్టాలు, నిబంధనలకు భిన్నంగా అధికారులు ఇచ్చిన ఆదేశాలు తక్షణమే ఉపసంహరించాలి
 • లేనియెడల ఆందోళన తప్పదు
 • సిహెచ్.బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
 • విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన వైద్య శాఖ అధికారి ఆగస్టు 5వ తేదీన” అతి జరూరు” పేరుతో చెత్త పన్ను చెల్లించకపోతే ఆగస్టు నుండి వేతనాలు
 • నిలిపివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గం.
 • చెత్త పన్ను వసూలు చేయటమే రాజ్యాంగ విరుద్ధం
 • అడ్డగోలుగా చెత్త పన్ను వసూలు చేస్తూ, పైపెచ్చు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో సహా అందరూ
 • చెత్త పన్ను చెల్లించకపోతే జీతాలు ఆపేస్తామని ప్రకటించడం అన్యాయం
 • కంచే చేను మేసినట్లుగా కార్మిక చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘించడం దారుణం
 • కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుధ్య సిబ్బందికి చెత్త పన్ను నుండి మినహాయింపు ఇవ్వాల్సింది పోయి, వేతనాలకు చెత్త పన్నుకు ముడి పెట్టడం గర్హనీయం.
 • సామాజిక న్యాయం, పేదల ప్రభుత్వము అంటూ డబ్బా కొట్టుకుంటూ పేదలు, బలహీనవర్గాలకు చెందిన కార్మికుల వేతనాలు నిలిపివేస్తామని బెదిరించడం తగదు.
 • కార్మికులకు వేతనాలు నిలిపి వేసి వారిని, వారి కుటుంబ సభ్యులను పస్తులు పెట్టే దుర్మార్గమైన ఆదేశాలు జారీ చేయటం క్షంతవ్యం కాదు.
 • వేతనాలు నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదు.
 • చెత్త పన్ను చెల్లించాలని ఎవరికీ నోటీసులు ఇవ్వడం లేదు, కట్టిన వారికి రసీదులు కూడా సరిగా ఇవ్వడం లేదు
 • ఇది పన్నునా ? యూజర్ చార్జీనా?
 • ప్రజల అభ్యంతరాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా యూజర్ చార్జీలు వసూలు చేసే అధికారం ఎవరికి లేదు
 • పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు జీతం ఇచ్చినా, తక్కువేనంటూ ముఖ్యమంత్రి జగన్ కార్మికులపై ప్రేమ వలకబోశారు.
 • చిరు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు సైతం పెన్షన్లు, సంక్షేమ పథకాలు నిలిపివేశారు.
 • ఇప్పుడు చెత్త పన్ను భారాన్ని మోపుతున్నారు.
 • కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కోసం, కేంద్రం మెప్పుతో రుణాలు తీసుకోవడానికి చెత్త పన్ను భారం మోపారు
 • స్వచ్ఛభారత్ ,క్లీన్ ఏపీ CLAP పేరు చెప్పి చెత్త వాహనాల కాంట్రాక్టు బడా కంపెనీకి కట్టబెట్టారు
 • ప్రతి వాహనానికి నెలకు 62,000 చెల్లిస్తున్నారు
 • బడా కంపెనీలకు మేలు చేయడం కొరకు ప్రజల నుండి చెత్త పన్ను వసూలు చేయడం, కార్మికులకు వేతనాలు కూడా నిలిపివేస్తామని ప్రకటించడం ఆక్షేపనీయం
 • ఒకవైపున వృద్ధులు, వితంతువులు వికలాంగులను బెదిరించి పెన్షన్ లోనే చెత్త మొత్తాన్ని కోత పెడుతున్నారు
 • ఇప్పుడు జీతం నిలిపివేస్తామని కార్మికులను బెదిరిస్తున్నారు
 • ప్రజలను భయభ్రాంతులను చేసి పన్నులు వసూలు చేయటం నిరంకుశత్వం కాదా?
 • ఈ అమానుష చర్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, వైయస్సార్ పార్టీ ప్రజాప్రతినిధులు మౌనం వీడాలి
 • తక్షణమే విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలి
 • లేనియెడల కార్మికులు ఉద్యమిస్తారు, ప్రజలు వారికి అండగా నిలుస్తారు
 • చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here