చెల్లెల్ని ప్రేమించాలని వేధించిన యువకుడు

0
5
ananthapur brother attacks on sister

తన ప్రేమను నిరాకరించిన యువతిపై ఘాతుకానికి తెగబడ్డాడో ఓ యువకుడు. ప్రేమించలేదనే అక్కసుతో యువతిని కారుతో ఢీకొట్టిన ఉన్మాది.. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దారుణమైన ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆగస్టు 1న చోటుచేసుకుంది. కంబదూరు మండలం బోయలపల్లి వద్ద స్కూటీపై వస్తున్న యువతిని ప్రేమోన్మాది కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుక్కరాయ సముద్రం మండలం అమ్మరాజుపేట గ్రామానికి చెందిన గుజ్జల భాస్కర్.. అదే గ్రామానికి చెందిన గుజ్జల మైథిలిని ప్రేమించాలని వెంటబడ్డాడు. పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు. వరుసకు అన్నయ్య కావడంతో మైథిలి అతడి ప్రేమను నిరాకరించింది. అతడి వేధింపుల భరించలేక మైథిలి తల్లి కళ్యాణదుర్గానికి బదిలీ చేసుకుంది. దీంతో ఆమెపై అక్కసు పెంచుకున్న భాస్కర్.. ఆమెపై హత్యాయత్నం చేశాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయం కుంబదూరు మండలం బోయలపల్లి సబ్-స్టేషన్ వద్ద స్కూటీతో వస్తుండగా కారుతో ఢీకొట్టాడు.ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలు కాగా.. భాస్కర్ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బాధితురాలి మైథిలి ప్రస్తుతం కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భాస్కర్ అన్న వరుస కావడంతో ప్రేమకు నిరాకరించినట్టు గుర్తించారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. వరుసకు అన్ని అయినందునే భాస్కర్ ప్రేమను మైథిలి నిరాకరించిందని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here