అతను ఒక విప్లవం, చైతన్యం ,పేరు ఖుధీ రామ్ బోస్ నేడు ఉరి తీయబడిన రోజు….!!
18 ఏళ్ళు 8 నెలల 8 రోజులు వయసులో క్రైస్తవ-బ్రిటీష్ వారు ఉరితీసిన అతి చిన్న స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు, అతను మరియు అతని మిత్రుడు ప్రఫుల్లల సర్కార్ సాయంతొ బాంబులతో గుర్రపు బండిపై వెళుతున్న క్రైస్తవ-బ్రిటీష్ అధికారి (Dutch mejistrate Kingsford) ని చంపారు , తరువాత అతను క్రైస్తవ-బ్రిటీష్ పోలీసులకు పట్టుబడ్డాడు. బీహార్లోని ముజఫర్ లో అనేక మంది భారతీయులను హతమార్చిన క్రూర అధికారి Kingsford పై ప్రతీకారం తీర్చుకున్నారు.అతన్ని చంపిన తరువాత, బోస్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి రోజూ రాత్రి సమయంలో 25 మైళ్లు నడిచేవాడు,కొన్ని రోజులకు ఇప్పుడు VAINI సమీపంలో దొరికాడు, ప్రస్తుతం దీనిని ఖుడీరామ్ బోస్ స్టేషన్ గా పిలుస్తారు.
1889 లో జన్మించిన ఖుదిరామ్ బోస్ మిడ్నాపూర్ బెంగాల్ నుండి వచ్చారు. 15 ఏళ్ళ వయసులో అతను క్రైస్తవ-బ్రిటిష్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి అరబిందో ఘోష్ మరియు సోదరి నిమితీటాలనుంచి ప్రేరణ పొందాడు అతను విప్లవకారులతో చేరాడు మరియు 3 సంవత్సరాలలో చాలామంది క్రైస్తవ-బ్రిటీష్ వారిని బాంబుల తో చంపడానికి లక్ష్యంగా చేసుకుని చంపాడు, చివరికి ఏప్రిల్ 30,1908 న పట్టుబడ్డాడు అతను పట్టుకున్నప్పుడు అతను ముజఫర్పూర్ లో వీదులన్ని తిప్పారు, అలా తిప్పినపుడు ఆసలు విచారంగా లేడు పైగా సంతోషంగా ఉన్నాడు. అతను వందేమాతరం అంటూ నినాదాలనుచేస్తూ అరవటం మొదలు పెట్టాడు,అతని స్నేహితుడు ప్రఫుల్లా కూడా పట్టుబడ్డాడు , విప్లవ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరులుగా మారారు.
బోస్ జైలులో ఉన్నపుడు ఎవరి పేరును క్రైస్తవ-బ్రిటీష్ అదికారులకు ఎంత వేదించినా చెప్పలేదు పైగా ఇతర విప్లవకారులను రక్షించడానికి వారు చేసిన పనులను తనపై వేసుకుని అందరికీ పడే శిక్ష ను తను సంతోషం గా స్వీకరించాడు ,అతనికి మరణశిక్ష విదించినపుడు సానుభూతి పరులను స్నేహితులను ఉత్సాహపరిచాడు,ఉరివేశే రోజున తన తాడును తానే చిరునవ్వు తో స్వయంగా మేడకు తగిలించుకున్నాడు.
ఈ మరణం భారతదేశంలో చాలా మంది యువతకు ప్రేరేపించాయి మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అగ్ని యుగం అని పిలవబడేి ఆ రోజులలో చాలామంది యువకులు వీరి త్యాగాలను చూసి ఈ ఉద్యమంలో చేరారు మరియు తమ జీవితాలను బలి చేశారు .ఆగష్టు 11, 1908 ఖుదిరామ్ బోస్ ను ఉరితీశారు…
18 ఏళ్ళ నుండి 80 ఏళ్ళ వయస్సు ఉన్న 3 లక్షల మంది దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైనారు