చేనేత రంగాన్ని ఆదుకోవాలి

0
2

చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆప్కో వారి ఎగ్జిబిషన్ మరియు సేల్ అగ్రికల్చరల్ tv కాలేజీ రోడ్లో గల స్వర్ణ కాంప్లెక్స్ నందు ఆప్కో విక్రయశాలను కలెక్టర్ విజయ కృష్ణన్ , ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నత కోసం విరివిగా విక్రయాలు చేసి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశములు కలిగించాలని చెప్పారు.చేనేత వస్త్రములు ధరించడం వలన హుందాగా ఉంటుందన్నారు. జిల్లాలో ప్రజలు అందరూ చేనేత వస్త్రములు కొనుగోలు చేసి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్ రాజ వర్ధన్, మున్సిపల్ కమిషనర్ ర్ భాను ప్రతాప్, ఆప్కో సిబ్బంది బి. సుశీల, డి ఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. డి.పి.ఆర్.ఓ ఐ&పి.ఆర్.బాపట్ల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here