రాష్ట్ర స్థాయి మార్కెట్ యార్డ్ చైర్మన్ ల సదస్సు ఈ నెల 30 వ తేదిన ఉదయం గుంటూరు మిర్చియార్డ్ కార్యాలయంలో జరిగింది.ఈ సదస్సుకు గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం అధ్యక్షత వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ మరియు సహకార సలహాదారులు బత్తుల బ్రహ్మనందరెడ్డి,ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొని ప్రసంగించారు.మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి,మార్కెట్ యార్డ్ సిబ్బంది,ఇతర జిల్లాల మార్కెట్ యార్డ్స్ చైర్మన్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.సమావేశ అనంతరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ మరియు సహకార సలహాదారులు బత్తుల బ్రహ్మనందరెడ్డి గారికీ శాలువాలు కప్పి,మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.