చౌక బియ్యం అక్రమాలపై అధికారుల మెరుపు దాడులు.

0
3

రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ DG గారైన శంఖ బ్రత భాగ్చి IPS నేతృత్వం లో తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన కె ఈశ్వర రెడ్డి తమ సిబ్బంది తో చాకచక్యంగా ఆగస్టు 4 మరియు 5 తేదీలలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో

  • చిత్తూరు జిల్లా GD నెల్లూర్ లో 3 లారీలతో సహా 26 టన్నుల PDS బియ్యాన్ని,
  • తిరుపతి జిల్లా కేవీబీ పురం లో 2 లారీలతో సహా 13 టన్నుల PDS బియ్యాన్ని,
  • పిచాటురు లో ఒక ఆటో తో పాటు ఇంటిలో దాచిన 10 టన్నుల PDS బియ్యాన్ని
  • గాజుల మండ్యం వద్ద ఒక లారీని దాదాపు 20 టన్నుల బియ్యాన్నీ
  • స్వాధీనం చేసుకుని ముద్దాయిలను పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా ఈశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే చౌక బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి రవాణా చేసే వారి పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here