జగనన్న ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని బుధవారం ఎం.కొత్తపల్లి ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తూ అధికారులకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి సూచనలు చేసారు. ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, రాళ్ళను ఎక్కువ మొత్తంలో సేకరించి లే అవుట్లలోని గౌడన్లలో స్టాక్ వుంచుకోవాలన్నారు. నీటి ఎద్దడి ఎదురుకాకుండ లే అవుట్లలో అవసరమైన బోర్లను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్ పాల్గొన్నారు.