జ‌గ‌న్ పాల‌న‌లో విద్యావ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం..

0
1

ఊర్లో మద్యం షాపులు…ఊరి బయట బడులు ..జ‌గ‌న్ పాల‌న‌లో విద్యావ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా త‌యారైంది. అద్దంకి శాసనసభ్యులు గౌ!శ్రీ గొట్టిపాటి రవికుమార్.

సంతమాగులూరు మండలం పాతమాగులూరు పర్యటనలో ఉన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి దృష్టికి పలువురు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల విలీన ప్రక్రియ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఈసందర్భంగా మాట్లాడుతూ…

జాతీయ విద్యా విధానం – 2020ను దృష్టిలో పెట్టుకొని, అద్దంకి నియోజకవర్గంలోని మండల పరిషత్ పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలి
.
బడిని దూరం చేసి చదువును భారం‌ చేయొద్దు. 3,4,5 తరగతులు విలీనాన్ని వెంటనే ఆపాలి.

వైకాపా ప్రభుత్వంలో ఊరికి మ‌ధ్య‌లో ఉండాల్సిన బ‌డులు దూరంగా, ఊరికి దూరంగా ఉండాల్సిన మ‌ద్యం షాపులు .. ఊరి మ‌ధ్య‌లోకి తెచ్చారు.

ఇంటి పక్కన ఉన్న రేషన్ తెచ్చుకోవడం భారం అని వ్యాన్లు పెట్టి మరి డోర్ డెలివరీ చేస్తున్నామని గొప్పలు చెప్పి, నేడు 3,4,5 తరగతులు చదివే చిన్నపిల్లలు కిలోమీటర్ల దూరం ఎలా వెళతారు అని ప్రశ్నించారు

పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల బాలికలు గ్రామాలలో విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది.

వైకాపా ప్రభుత్వ విధానం స్వాతంత్రానికి పూర్వం విద్యావ్యవస్థ లాగా బాలికలకు విద్యను దూరం చేస్తుంది.

పాఠశాలల విలీనాన్ని ఆపాలి జిఓ నెంబర117 రద్దు చేయాలని విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాలు,యువజన సంఘాలు ఉపాద్యాయులు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

పాఠశాలలు విలీనం వలన ఉపాద్యాయులు,విద్యార్థుల నిష్పత్తి 1:40 నుండి 1:60 కి పెరుగుతుంది అన్నారు,రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు ఉపాద్యాయులు లేరన్నారు.

ఇలాంటి ఈ పరిస్తితులలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ ఏరకంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వగలరో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విలీన ప్రక్రియ వలన వేలాది మంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది అన్నారు.

నాడు నేడు పేరుతో 6000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ పాఠశాలలు మూసేయడం అంటే డబ్బు వృధా కదా అని ప్రశ్నించారు?

విద్యార్థులను బాలకార్మికులుగా మార్చాలనే విధంగా సాగుతున్న పాఠశాలల విలీనం జగన్ రెడ్డి దశ దిశ లేని పాలనకు నిదర్శనం.

డ్రాపౌట్ లు పెరిగే ప్రమాదం వున్నదని ఆడపిల్లల చదువు మానుకునే పరిస్తితి వస్తుంది అన్నారు.

భవిష్యత్ లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ వుండవన్నారు. ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు డియస్సీ కోసం ఎదురు చూస్తున్నారని ,వారందరికీ అన్యాయం చేసినట్టు అవుతుంది అన్నారు.

కార్పొరేట్లకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అద్దంకి నియోజకవర్గంలో SC,ST కాలనీలలోని పాఠశాలలు విలీనం చేయడం జరిగింది.

రోజువారి కూలీకి వెళ్లే పేద కుటుంబాలు నివసించే ప్రాంతాలలో ఈ పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు పాఠశాలలు విలీనం అంటూ కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటే నీటి కాలువలు హైవే రోడ్డు దాటుకుని వెళ్లగలిగే స్థాయి 3,4,5 తరగతులు విద్యార్థులకు లేదని.

ఈ పాఠశాలల విలీనానికి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. వారికి సమీపంలో ప్రస్తుతమున్న పాఠశాలల్లోనే 3,4,5 తరగతులను కొనసాగించాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here