జగన్ రెడ్డి రాజ్యం.. నేరగాళ్లకు స్వర్గంలా మారింది
నంద్యాలలో పోలీస్ కానిస్టేబుల్ ను రౌడీషీటర్లు హత్య చేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.
- జగన్ రెడ్డి రాజ్యం నేరగాళ్లకు స్వర్గధామంలా తయారైందని మండి పడ్డారు.
జగన్ రెడ్డి రాజ్యం నేరగాళ్ల పాలిట స్వర్గంలా తయారైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకుంటే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లా డీఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ ను.. పట్టణం నడిమధ్యలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు రౌడీషీటర్లు.
ఈ ఘటనపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అత్యంత దారుణమైన ఈ హత్య.. రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితిని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు.
కానిస్టేబుల్ ను చంపిన వారు ఎవరో తెలిసినా.. ఇప్పటికీ పోలీసు బాస్ లు పట్టుకోలేదని మండి పడ్డారు.