జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

0
4

 ఈ పదాలు వాడొద్దు, ఇకపై వారిని అలా పిలిస్తే కేసు!

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి వంటి పదాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. ఈ పదాలను ఉపయోగించిన వారిని భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు.

జగన్ సర్కార్ తీసుకుని నిర్ణయంపై నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఆవేదనను తెలసుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో కూడా తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ స్వాగతించారు. తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని కోరారు.

అంతేకాదు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం జగనన్న చేదోడు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద వేలాది మంది నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అర్హులైన వారికి ఈ పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున అందజేస్తున్నారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని కించపరిచే పదాలపై నిషేధం విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here