జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

0
2

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఈ నెల 13వ తేది జరగబోవు జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ కార్యక్రమం గురించి కక్షిదారులు అవగాహన కల్పిస్తూ ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్., మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 13వ తేదిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను నిర్వహించ బడుతున్నట్లు, జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ చేయదగిన క్రిమినల్‌, సివిల్‌, రోడ్డు ప్రమాదాలు మరియు కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులలో ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించాలని పోలీస్ అధికారులకు తెలిపారు.

కోర్టు వారు ఇచ్చిన నివేదిక ప్రకారం రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి ఇరు పక్షాల వారిలో మెగా లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.

నోటీసులు అందిన కక్షిదారులు వారి కేసులను లోక్‌అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరించుకొనేందుకు ముందుకు రావాలని, కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే శ్రమ, సమయం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని, సత్వరం పరిష్కారం లభస్తుందని, ఇరు పక్షాల మధ్య స్నేహపూరిత సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు. కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here