జాన్సన్ బేబీ పౌడర్‌లో కేన్సర్ కారకాలు..

0
10

అమ్మకాలపై జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సంచలన నిర్ణయం

చిన్న పిల్లలకు సంబంధించిన సబ్బులు, పౌడర్లు వంట ఉత్పత్తుల అమ్మకాల్లో దశాబ్దాలుగా ప్రపంచ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చెలాయించింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. అయితే, ఈ సంస్థ నుంచి వచ్చిన బేబీ పౌడరులో గర్భాశయ కేన్సర్‌ను కలిగించే అస్బెస్టాస్ వంటి హానికారక రసాయనం ఉన్నట్టు తేలడంతో అమెరికా, కెనడాలు రెండేళ్ల కిందటే దీనిని నిషేధించాయి. ఈ ఉత్పత్తిని కొనుగోలుచేసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వేలాదిగా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు.

తాము ఉత్పత్తి చేసిన బేబీ పౌడర్‌లో కేన్సర్ కారకాలున్నట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కేన్సర్ కారకమైన బేబీ పౌడరు (Baby Powder) అమ్మకాలను 2023లో ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలున్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో అమెరికాలోని వేలాది మంది వినియోగదారులు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు.

చిన్న పిల్లలకు సంబంధించిన సబ్బులు, పౌడర్లు వంట ఉత్పత్తుల అమ్మకాల్లో దశాబ్దాలుగా ప్రపంచ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చెలాయించింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. అయితే, ఈ సంస్థ నుంచి వచ్చిన బేబీ పౌడరులో గర్భాశయ కేన్సర్‌ను కలిగించే అస్బెస్టాస్ వంటి హానికారక రసాయనం ఉన్నట్టు తేలడంతో అమెరికా, కెనడాలు రెండేళ్ల కిందటే దీనిని నిషేధించాయి. ఈ ఉత్పత్తిని కొనుగోలుచేసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వేలాదిగా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు

జాన్సన్ అండ్ జాన్సన్

ప్రధానాంశాలు:

  • జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌పై వ్యాజ్యాలు.
  • కేన్సర్ కారక అస్బెస్టాస్ ఉన్నట్టు నిర్ధారణ.
  • వచ్చే ఏడాది నుంచి అమ్మకాలు నిలిపివేత.

తాము ఉత్పత్తి చేసిన బేబీ పౌడర్‌లో కేన్సర్ కారకాలున్నట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కేన్సర్ కారకమైన బేబీ పౌడరు అమ్మకాలను 2023లో ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలున్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో అమెరికాలోని వేలాది మంది వినియోగదారులు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు.

దీంతో అమెరికా, కెనడాలు 2020వ సంవత్సరంలో ఈ పౌడర్ అమ్మకాలను నిలిపివేశాయి. గత దశాబ్ద కాలంలో ఆ సంస్థ బేబీ పౌడర్ అమ్మకాలపై వేలాది వినియోగదారులు భద్రతా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను 2023లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తాజాగా ప్రకటించింది.

కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విక్రయిస్తున్నారు. ఆస్బెస్టాస్ కేన్సర్ కారకంతో కలుషితం కావడం వల్ల దాని టాల్క్ ఉత్పత్తులు వ్యాధికి కారణమయ్యాయని 38 వేల వ్యాజ్యాలను కోర్టుల్లో వేశారు. దీంతో బేబీ పౌడరును ల్యాబ్‌లో పరీక్షించగా ఆస్బెస్టాస్‌ పాజిటివ్‌ అని తేలింది.

‘‘దీర్ఘకాలిక వృద్ధి కోసం వ్యాపారాన్ని ఉత్తమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మేము మా పోర్ట్‌ఫోలియోను నిరంతరం మూల్యాంకనం చేస్తాం.. ఆప్టిమైజ్ చేస్తాం’’ అని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి మెలిస్సా విట్ ఇ-మెయిల్ ప్రకటనలో తెలిపారు. ‘‘నేటి నిర్ణయం ప్రపంచవ్యాప్త పోర్ట్‌ఫోలియో మదింపులో భాగం.. ఇది భౌగోళిక ప్రాంతాలలో మా ఉత్పత్తులకు డిమాండ్‌లో తేడాలు, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల పోకడలు, ప్రాధాన్యతలతో సహా అనేక అంశాలను విశ్లేషించింది’’ అని పేర్కొన్నారు.

కాగా, జాన్సన్ సంస్థపై వినియోగదారుల తరఫున లా సూట్ వేసిన న్యాయవాది లీ ఓ డెల్ స్పందిస్తూ.. ‘‘దశాబ్దాలుగా టాల్క్ ఆధారిత ఉత్పత్తులను విక్రయించిన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషులకు ప్రాణాంతక క్యాన్సర్‌లు వస్తాయని తెలుసు.. జాన్సన్ అండ్ జాన్సన్ ఎట్టకేలకు సరైన పని చేసింది.. రెండు సంవత్సరాల కిందట ఉత్తర అమెరికాలో అమ్మకాలను నిలిపివేశారు.. ఈ చర్య తీసుకోవడంలో జాప్యం క్షమించరానిది’’ అని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here