శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లాలోని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఈ నెల 28 తేదిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమస్యలు పై గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ గారి ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వర్యులు సీదిరి. అప్పలరాజు గారు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో గౌరవ MLC శ్రీ దువ్వాడ. శ్రీనివాస్ గారు పాల్గొని మాట్లాడుతూ భావనపాడు హార్బర్ ఏర్పాటు చేయనున్న ప్రాంతం ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలని వివరించారు. పెన్షన్ సమస్యలు, గృహ నిర్మాణానికి సంబంధించి అంతర్గత సమస్యలు పై దృష్టి సారించాలని చెప్పగా దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. జగనన్న అన్ని కాలనీల్లో సిసి రోడ్లు, ప్లాంటేషన్,ఇంటింటికీ పైపు లైన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అంగన్వాడీ కేంద్రాలు సమస్యలు గూర్చి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్ గారు,పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జిల్లా స్థాయి మరియు డివిజనల్ స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.