జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ..

0
1

కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి – ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీనాగేశ్వరరావు గారు ఈనెల 13 న జరిగే లోక్ అదాలత్ పై జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు కోర్ట్ కానిస్టేబుల్ లతో జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈనెల 13 న జరిగే లోక్ అదాలత్ కార్యక్రమంలో అధిక కేసులు డిస్పోజల్ అయ్యేలా చూడాలని అడిషనల్ ఎస్పీ గారు సూచించారు. లోక్ అదాలత్ లో కాంపౌండబుల్ కేసులు, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, న్యూసెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, శ్యాండ్ కేసులు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన కేసులలో రాజీపడేటట్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, రాజీపడదగిన కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని, రాజీ పడ్డ దగిన కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో ధనం మరియు సమయాన్ని వృద్ధ చేసుకోవద్దని, సమస్యల పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గమని వారికి అర్థమయ్యే విధంగా తెలపాలని అధికారులకు సూచించారు. రాజీపడదగిన కేసులలో అన్ని కేసులు లోక్ అదాలత్ లో రాజీ పడేటట్లు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో DCRB ఇన్స్పెక్టర్ యన్. శ్రీకాంత్ బాబు మరియు ఐటీ కోర్ సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here