జూ పార్క్ లో కొత్తగా మూడు ఆకర్షణలు

0
7

నిత్య నూతనంగా వెలుగొందుతూ.. దేశంలోనే ప్రముఖ జంతు ప్రదర్శనశాలగా పేరుపొందిన హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ 59 ఏళ్లు పూర్తిచేసుకుని 60 వ ఏట అడుగు పెట్టింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న 68వ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీశాఖ నెహ్రూ జూ పార్క్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది.కొత్తగా మూడు ఆకర్షణలు జూ పార్కు తోడయ్యాయి. దక్షిణాఫ్రికాలో కనిపించే ముంగిస జాతికి చెందిన మీర్ క్యాట్, దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే చిన్న కోతి జాతికి చెందిన మార్మో సెట్ ఎంక్లోజర్లను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్. ఎం. డోబ్రియాల్ ప్రారంభించారు. వివిధ రకాల కు చెందిన చేపలతో కూడిన కొత్త ఓపెన్ ఫిష్ పాండ్ ను కూడా ఇవాళ జూ పార్క్ లో ఆవిష్కరించారు.కొన్నాళ్ల క్రితం జూలో జన్మించిన ఆసియాటిక్ సింహం (ఆడబిడ్డకు) ఇవాళ అదితి అని నామకరణం అధికారులు చేశారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఓఎస్డి శంకరన్, రిటైర్డ్ అటవీ అధికారులు బుచ్చి రామ్ రెడ్డి, నాగభూషణం, డిప్యూటీ క్యురేటర్ నాగమణి, ఇతర జూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here