జ్యోతి గ్రానైట్ & క్వాడ్జ్ సర్ఫెస్ పరిశ్రమలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్…

0
11

…గుళ్ళాపల్లి పారిశ్రామిక వాడలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతి గ్రానైట్ & క్వార్డ్జ్ సర్ఫెస్ ఉద్యోగులు.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తియిన సందర్బంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మరియు ఆంద్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశంజిల్లా గుళ్ళాపల్లి పారిశ్రామిక వాడలో జ్యోతి గ్రానైట్ మరియు జ్యోతి క్వార్డ్జ్ సర్ఫెస్ పరిశ్రమలో “హర్ ఘర్ తిరంగా” జండా సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జ్యోతి గ్రానైట్ & జ్యోతి క్వార్డ్జ్ మేనేజ్మెంట్ తమ సంస్థలలో పని చేసే సిబ్బందికి జాతీయ జెండాలను పంపిణీ చేసి దేశ భక్తిని చాటుకున్నారు.అనంతరం జ్యోతి గ్రానైట్ & జ్యోతి క్వార్డ్జ్ సర్ఫెస్ పరిశ్రమల ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం అలపించారు. ఈ సందర్భంగా జ్యోతి గ్రానైట్ & జ్యోతి క్వార్డ్జ్ సర్ఫెస్ ప్రతినిధులు మాట్లాడుతూఅత్యంత క్లిష్ట సమయాలలో ప్రపంచమే సంక్షేభంలో ఉన్న సమయంలో భారతీయులమైన మనం మన శక్తి, యుక్తులు, కష్టార్జితంతో మనల్ని మనం నిరూపించుకున్నామని. మన రాజ్యాంగం పట్ల, మన ప్రజాస్వామ్య సంప్రదాయాల పట్ల గర్విస్తున్నామని ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది భారతదేశం అని అన్నారు.74 సంవత్సరాల ఆజాది కా అమృత్ మహోత్సవాలలో భాగంగా తమ సంస్థల తరపున సామాజిక భాద్యతగా దేశ సమైక్య తను,సమగ్రతను చాటి చెప్పేందుకు హార్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టినట్లు జ్యోతి గ్రానైట్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here