టిడిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి

0
6

టిడిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఒంగోల్ నగర మేయర్ గంగాడ సుజాత హెచ్చరించారు. కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. టిడిపి నాయకుడు జీవి రాజ్ విమల్ గతాన్ని మరిచి. మా నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడటం బాధాకరమన్నారు. గౌరవం కూడా లేకుండా మాట్లాడటం ఎంతవరకు సబబుని ప్రశ్నించారు. ఒక మహిళా విషయంలో. పోలీస్ కేసు కాకుండా మీరు ఎలా తప్పించుకున్నారు ప్రజలందరికీ తెలుసు అని తెలిపారు. మరొక కార్పొరేటర్ నేను అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేశాడని. నిరూపిస్తే రాజీనామా చేయడానికి వెనుకాడనని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా మాట్లాడటం టిడిపి నాయకులు మానుకోవాలని. హితువు పలికారు. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడాలని హెచ్చరించారు. ఒంగోలు చరిత్రలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చికి రావాలని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టిడిపి హయంలో ఎంత అభివృద్ధి చేశారు ఒక కమిటీని వేస్తున్నామని. వారు ఎంత అభివృద్ధి చేశారు కమిటీ నివేదిక ఇస్తుందని. అప్పుడు మీ బండారు ప్రజలకు చెబుతామని తెలిపారు. మా నాయకుడు గడపగడపకు మన ప్రభుత్వం తిరుగుతుంటే ప్రజల స్పందన చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తాడి కృష్ణలత. యనమల నాగరాజు. గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ. నూక తోటి మస్తానమ్మ. ప్రవీణ్ కుమార్. తేళ్ళ.చంద్రశేఖర్. వైఎస్ఆర్ సీపీ నాయకులు నూక తోటిఈశ్వర్. తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here