జగన్ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత గర్జనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని కందుకూరు నియోజవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ప్రకటనలో ఆరోపించారు. వైకాపా పాలనలో దళితులకు దక్కాల్సిన నిధులు రావడం లేదని, వారి హక్కులను హరించి వేస్తున్నారని, జగన్ ప్రభుత్వం వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో దళితులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదన్నారు. ఒక్క కార్పొరేషన్ బదులు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఎటువంటి నిధులు కేటాయించకుండా మోసం చేశారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య గా పేరు మార్చడం దారుణమని మండిపడ్డారు. ఇదే విధంగా జగన్ రెడ్డి గారు వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా మీకు బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా విదేశీ విద్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కొనసాగించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలని లేని పక్షంలో ముందు ముందు రోజుల్లో దళితులంతా ఏకమై ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని నాగేశ్వరరావు గారు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎం.స్. రాజు గారిని, కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు…