టీఆర్‌ఎస్‌ తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

0
3

ఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి  ఫిర్యాదు చేశారు.

మునుగోడు ఎన్నికల్లో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మునుగోడు ఎన్నికల్లో నకిలీ ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు  

ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని.. మరో 14 వేల ఓట్లను కూడా తొలగించాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో డబ్బులు,మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని,ప్రభుత్వ వాహనాలను సైతం ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో  బీజేపీ పేర్కొన్నారు. 

Powered by

Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here