టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

0
1
bandi sanjay

 ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో బండి సంజయ్ విమర్శలకు పదును పెంచారు. ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను ఆకర్షిస్తున్నారు. తాజాగా పెద్దరావులపల్లిలో రచ్చబండ నిర్వహించిన బండి సంజయ్.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులు కలుషిత నీటిని బాటిళ్లలో తీసుకొచ్చి తమ బాధలను బండితో పంచుకున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రైతులకు సాగునీటి కోసం ప్రత్యామ్నాయ నీటి వనరులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కలుషిత నీటిలోనే పంటలు పండించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.భువనగిరి నియోజకవర్గంలోని చాలాచోట్ల మూసీ విషపూరితంగా మారిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దుర్వాసనతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీని శుభ్రం చేసేందుకు.. సుందరీకరణకు వందల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 4వ రోజున పెద్దరావులపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here