టీడీపీ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ..

0
6

అన్నా కేంటీన్లకు సిథ్థమౌతున్నTDP

వైసిపి ప్రభుత్వం అన్నా కేంటీన్లు ఎత్తి వేయటంతో తక్కువ రేటుకు భోజనం చేసినవారు హోటళ్ళకు వెళ్ళ్ళి వందల్లో ఖర్చు చేసుకొంటున్నారు.టీడీపీ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నేపథ్యంలో రాష్ట్రంలో తిరిగి అన్న క్యాంటీన్లను పునరుద్దరించేందుకు టీడీపీ వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పాలకొల్లు రాజమండ్రి గుంటూరు, మంగళగిరితో పాటు మరికొన్ని చోట్ల ఈ మధ్యే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అక్కడ రోజూ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు గతంలో ఇచ్చిన రూ.5 రూ.10 రేట్లకే భోజనం ఇస్తున్నారు,ందీంతో పేదలకు కాస్త ఊరట లభిస్తోంది. అయితే గతంలో అన్న క్యాంటీన్లకు ఇచ్చిన భవనాలను ప్రభుత్వం కూల్చివేయడమో లేక స్వాధీనం చేసుకోవడమో జరిగిపోవడంతో చేసేది లేక టెంట్లు వేసి మరీ టీడీపీ నేతలు భోజనాలు పెడుతున్నారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు పలు చోట్ల వైసీపీ నేతలు పోలీసులతో కలిసి అడ్డంకులు కల్పిస్తున్నారు. దీంతో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే మంగళగిరితో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన క్యాంటీన్లకు పోలీసులు ఎన్నో ఇబ్బందులు సృష్టించారు. చివరికి అనుమతివ్వక తప్పలేదు. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. స్ధానికంగా పేదలు, అడుక్కునేవారు, విద్యార్ధులు వీటిపై మక్కువ చూపుతున్నారు. వారికి అన్నం పెట్టకుండా అన్న క్యాంటీన్లను అడ్డుకుంటే స్ధానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వైసీపీ నేతలు కూడా దూకుడుగా ముందుకెళ్లలేని పరిస్ధితి.
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు పలు చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా స్థానికులు అన్నా కేంటీన్లు కావల్సిందే అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here