టీ20 సిరీస్ షురూ..!

0
7

T20 మ్యాచ్‌కి ట్రినిడాడ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అక్కడే ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోనూ సత్తాచాటిన టీమిండియా.. 3-0తో కరీబియన్ టీమ్‌ని ఓడించేసింది.

  • భారత్, వెస్టిండీస్ మధ్య ఈరోజు నుంచి టీ20 సిరీస్
  • ఫస్ట్ టీ20కి ఆతిథ్యం ఇవ్వబోతున్న ట్రినిడాడ్
  • రోహిత్ శర్మ, రిషబ్ పంత్, భువీ రీఎంట్రీ
  • హెడ్ టు హెడ్ రికార్డుల్లో భారత్‌దే పైచేయి

కరీబియన్ గడ్డపై వెస్టిండీస్‌ని వన్డేల్లో బుధవారం రాత్రి క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. ఈరోజు నుంచి అక్కడే ఐదు టీ20ల సిరీస్‌ని ఆడబోతోంది. ట్రినిడాడ్ వేదికగా రాత్రి 8 గంటలకి భారత్, వెస్టిండీస్ మధ్య ఫస్ట్ టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌‌కి దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈరోజు మ్యాచ్‌లో ఆడబోతున్నారు. వన్డేల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ని తన విధ్వంసక బ్యాటింగ్‌తో టెన్షన్ పెట్టిన వెస్టిండీస్ టీమ్.. టీ20ల్లో అత్యంత ప్రమాదాకారి.

అంతర్జాతీయ టీ20ల్లో భారత్, వెస్టిండీస్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే? ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 20 టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ జట్టు ఏకంగా 13 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. వెస్టిండీస్ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కానీ.. విధ్వంసక హిట్టర్లతో నిండిన కరీబియన్ టీమ్‌ని తక్కువ అంచనా వేస్తే? మూల్యం చెల్లించుకోక తప్పదని టీమిండియాని మాజీలు హెచ్చరిస్తున్నారు.

వెస్టిండీస్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మకి మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటికే విండీస్‌పై 585 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో 111 పరుగులు చేశాడు. మరోవైపు వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌కి కూడా ఇప్పటికే 335 పరుగుల్ని భారత్‌పై చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here