తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను వెనుక వైపు నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బదినగా డ్రైవర్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని లారీని వెనక్కు తీసి క్యాబిన్ నుండి డ్రైవర్ ను బయటకు తీశారు. స్వల్పంగా గాయపడ్డ అతన్ని గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో వైపు ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ ను సురేష్ గా పోలీసులు గుర్తించారు.