ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష, వాస్తు సిద్ధాంతి డా.జుటూరి భానుమూర్తి కి కడప జిల్లా, గండి వీరాంజనేయస్వామి క్షేత్రం లో ఆదివారంనాడు నిర్వహించిన “అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం”ఆధ్వర్యంలో శ్రీ గురు పురస్కారములలో భాగంగా సిధ్ధాంతరత్న అను బిరుదుతో సత్కరించారు. ఈ సందర్భంగా జుటూరి మాట్లాడుతూ తనకు ఈ బిరుదు రావడం సంతోషంగా ఉందని, 25 సంవత్సరాలుగా పంచాంగం రాస్తూ, జ్యోతిష, వాస్తు పరంగా సేవాలందిస్తున్నానని, ఇటువంటి పురస్కారాలు రావడం మరింత బాధ్యతను పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు డా;గోవిందు కులకర్ణి, ఉపాధ్యక్షులు డా;గౌరవవం సుబ్రహ్మణ్యం, రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి యితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా;జూటూరి ని పలువురు ప్రముఖులు ప్రశంసించి, అభినందనలు తెలియజేశారు.