మహిళపై నలుగురు అత్యాచారం..
దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒక్కడైన సతీష్.. ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే బాధితురాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్‌లో సతీష్‌ను కలుసుకుంది. ఆమెను.. సతీష్ అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి.. బాధితురాలని రైల్వే స్టేషన్‌లోని 8-9 ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్‌టేనెన్స్ రూమ్‌లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.