తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం జరుగనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవ శోభ ఉట్టిపడేలా ఆస్థానమండపం, ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.