గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మంగళవారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది.
గరుడ వాహనసేవలో సివిఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, విజివో బాలిరెడ్డి, పారు ఫతేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.