తిరుమల శ్రీవారికి ఘనంగా పవిత్రోత్సవాలు.. ఎప్పటి నుంచి.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..?

0
10

కలియుగ వైకుంఠం తిరుమలలో.. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శ్రీవారి ఆలయంలో  పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు? మరి ఈ పవిత్రోత్సవాలు ఎలా చేస్తారు..? ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో తెలుసా..?

అఖిలాండ కోటి బ్రహాండ నాయకుడు తిరుమల శ్రీవారు. కలియుగ వైకుంఠనాథుని రెప్ప పాటు చూస్తే చాలు తమ జన్మ ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. ఇలా ఏడాది పొడవునా శ్రీవారి ఆలయం లో తెలిసి తెలియక తప్పులు జరుగుతుంటాయి.  ఆ దోషాలు తొలిగిపోవాలి అంటే ఏం చేస్తారో తెలుసా..?

ప్రతి ఏటా శ్రావణమాసంలో శ్రీవారి ఆలయంలో  పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు…? అసలు పవిత్రోత్సవాలు ఎలా చేస్తారు అంటే..? ఈ నెల 8 వ తేది నుండి 10వ తేది వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ పవిత్రోతవాలకు అంకురార్పణ  నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు.

నిత్యం శ్రీవారికి జరిగే పూజా, సేవా కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే తప్పులకు మన్నించాలని కోరుతూ.. ఈ ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులు తెలిసో, తెలియకుండా పురుడు. మరణం, బహిస్టు సమయాల్లో అలయ ప్రేవేశం చేస్తే వాటి వల్ల కలిగే దోష పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల ప్రారంభ సూచికగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి వెళ్లి అంకురార్పనకు పుట్టమన్నును సేకరిస్తారు. తరువాత అర్చకులు పుట్టమన్నును ఊరేగింపుగా శ్రీవారి అలయానికి తీసుకెళ్ళి,  పవిత్రోత్సవాలకు ఇవ్వాళ అంకురార్పణ చేస్తారు.

ఈ నెల 8వ తేది నుండి 10వ తేదీ వరకు వరకు పవిత్రోత్సవాలను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఆ ఉత్సవాలకు మొదటి రోజున స్వామివారి అబిషేకోత్సవాలు ఆగమశాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.  ఏడాది పోడవనా జరిగిన స్వామివారి పూజా కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాలకు ప్రాయశ్చితంగా జరిగే ఈ ఉత్సవాను అత్యంత వైభవంగా టీటీడి నిర్వహిస్తుంది

ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో దశమినాడు ప్రారంభమై, ద్వాదశినాడు ముగుస్తుంది. ఆగమశాస్త్రోక్దంగా జరిగే ఈపవిత్రోత్సవాలలో ఉత్సవమూర్తిల కవచాలను తోలగించి శుభ్రపరిచి ఉత్సవమూర్తిలకు ఎదైనా అరుగుదలవున్నట్లు అయితే వాటికి చందనపు ముద్దలతో సరిచేసి తిరిగి కవచాలను తోడిగి ప్రత్యేక పూజలు చేస్తారు.

స్వామివారి అబిషేకంతో ప్రారంభమయ్యి, హొమం, పవిత్రాల ఆవాహనం, మూడవరొజున సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో 1464 నుండి ఐదురోజులపాటు జరిగేవి, అయితే 1963 నుంచి ఈ ఉత్సవాలను 3 రోజులకు తగ్గించారు. అప్పటి నుండి నేటివరకు ప్రతి ఏటా శ్రావణమాసంలో టీటీడి సంప్రదాయ బద్దంగా ఈ కైకర్యాన్ని నిర్వహిస్తోంది.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here