తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ నేత..

0
12

నన్ను సస్పెండ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు: జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్

జనసేన పార్టీలో తాను భీష్ముడు లాంటి వాడినని.. తాను చావాలి అనుకుంటే తప్ప.. తనకు చావు లేదు అన్నారు జనసేన పార్టీ నేత, తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్‌. ‘ఫేక్ లెటర్ పెట్టే యదవలకి నేను చెపుతున్న దమ్ముంటే మీ పేరు రాసి పెట్టండి’ అంటూ మండిపడ్డారు. జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌‌ను సస్పెండ్ చేశారని మంగళవారం నకిలీ లెటర్‌ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనిపై బొలిశెట్టి ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీ బలోపేతం, ఎదుగుదల ఓర్వలేక కొంతమంది ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

తనను సస్పెండ్ చేసే ధైర్యం ఎవరికి లేదన్నారు శ్రీనివాస్. దీనిపై తాను సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేస్తానని.. దీనికి తగిన సమాధానం తొందరలోనే చెబుతానన్నారు. తానేమీ దొంగ టెండర్లు వేయడం లేదని.. స్థలాలు కబ్జా చేయడం లేదన్నారు. మట్టి, ఇసుక అమ్ముకోవడంలేదని.. తన సొంత డబ్బుని తాను పంచి పెట్టుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here