తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్…

0
6

స్వాతంత్య్ర సమరంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందీ కాంగ్రెస్సేనని మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు.శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆజాదీకా గౌరవ్‌ యాత్ర పేరిట తాండూర్‌, కొడంగల్‌, పరిగి మీదుగా 75 కిలోమీటర్ల కాంగ్రెస్‌ నాయకుల పాదయాత్ర సాయంత్రం వికారాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే త్యాగాలమయమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాయమాటలు నమ్మి రెండుసార్లు అధికారం కట్టబెట్టారని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తారనుకుంటే, మిగులుగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌, కాంగ్రెస్‌ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, పరిగి మండలాధ్యక్షుడు పరుశురాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here