తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. 

0
9

తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు శుక్రవారం (ఆగస్టు12) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటల 15 నిముషాలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూహెచ్‌లో ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేశారు. టీఎస్‌ ఎంసెట్‌ 2022 ఫలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్‌ ‘కీ’ కూడా విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌లో రిజల్ట్స్‌ చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎంసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. టాప్‌ ర్యాంక్‌లన్నీ అమ్మాయిలనే వరించాయి. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో లక్ష్మిసాయి లోహిత్‌ రెడ్డి (హైదరాబాద్‌) ఫస్ట్‌ ర్యాంక్‌

TS Eamcet 2022 Result ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే ‘EAMCET 2022 score card’ లింక్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • ఆ తర్వాత లాగిన్‌ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌ చెయ్యాలి.
  • వెంటనే స్క్రీన్‌ పై ఫలితాలు కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం హార్డు కాపీని సేవ్‌ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

ఈ ఏడాది జులై 18 నుంచి 21 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు, జులై 30, 31 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. టీఎస్‌ ఎంసెట్‌ 2022 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 1,56,812 మంది హాజరుకాగా, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా కోర్సులకు నిర్వహించిన పరీక్షకు 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక తెలంగాణ ఈసెట్‌ 2022 పరీక్ష జులై 1న నిర్వహించగా.. ఈ పరీక్షకు 9,402 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి సబితా వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here