తైవాన్ కు అండగా అమెరికా.. చైనా ఒంటెత్తు పోకడలు.

0
6

China-Taiwan War: తైవాన్ విషయంలో అమెరికా, చైనా అనవసర పట్టింపులకు పోతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయి. తైవాన్ విషయంలో చైనా ఒంటెత్తు పోకడలు పోవడంతో అమెరికా అడ్డుకట్ట వేయాలని చూస్తోంది.

  • ఇందులో భాగంగానే డ్రాగన్ ను ఎందుర్కొనే చర్యలకు పూనుకుంది. సముద్ర జలాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రెండు అగ్ర రాజ్యాల మధ్య యుద్ధానికి ఆజ్యం పోస్తోంది తైవాన్ అనడంలో సందేహం లేదు. చిన్న దేశమైన తైవాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాలని అమెరికా చెబుతుంటే అది మా భూభాగమే అని చైనా బుకాయిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఈ మేరకు ఆ దిశగా చర్యలు ఉండటం గమనార్హం.
  • తైవాన్ పై చైనా దూకుడును అరికట్టాలని అమెరికా భావిస్తోంది. ఇందుకు గాను యుద్ధ వాహక నౌక రోనాల్డ్ రీగన్ ను అందుబాటులోకి తెస్తోంది. దీంతో చైనా ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే ఉపేక్షించకుండా తక్షణమే దానికి బుద్ధి చెప్పే యోచనలో అగ్రరాజ్యం ఆలోచిస్తోంది. దీనికి గాను తైవాన్ అన్ని విషయాల్లో ఆదుకుంటామని భరోసా ఇస్తోంది. అందుకే అమెరికా స్పీకర్ నాన్సీ పర్యటన చేసింది దీన్ని చైనా తట్టుకోలేకపోతోంది. తైవాన్ కు మద్దతు ఇచ్చే విషయంలో అమెరికా చర్యను చైనా ఖండిస్తోంది. తైవాన్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది.
  • రోనాల్డ్ రీగన్ అత్యంత శక్తివంతమైన నౌక. ఇందులో అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. యుద్ధ విమానాలతో పాటు పలు ఆయుధ సంపత్తిని తనల ఉంచుకుంటుంది. దీంతో డ్రాగన్ ఏదైనా చేయాలనుకుంటే దాన్ని తక్షణమే తిప్పికొట్టే వ్యూహంలో అమెరికా వ్యూహాలు రచిస్తోంది. దీంతో డ్రాగన్ వెనకకు తగ్గక తప్పడం లేదు. అమెరికా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. దీన్ని గుర్తించిన డ్రాగన్ తైవాన్ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ సమాజంలో ఏకాగిగా మిగిలితే చోటు చేసుకునే పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
  • చైనాను అదుపులో పెట్టే ఉద్దేశంతో అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. డ్రాగన్ ను భయపెట్టే క్రమంలో యుద్ధ వాహక నౌకను అందుబాటులోకి తేవడంతో చైనాకు పరోక్ష హెచ్చరిక చేస్తోంది. కానీ చైనా దీన్ని పట్టించుకుంటుందా? అమెరికా బెదిరింపులను లెక్క చేస్తుందా? యుద్ధానికే సిద్ధమంటుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. అమెరికా, చైనా దేశాలు తమ పంతం తగ్గించుకోవడం లేదు. యుద్ధానికి రెడీ అన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. తైవాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లేందుకు డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. వీటిని తిప్పికొట్టేందుకు అగ్రరాజ్యం కూడా తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తోంది. దీంతో భవిష్యత్ లో ఏం జరుగుతుందో తెలియడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here