తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

0
5

మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. 208 పరుగుల భారీ స్కోరును కూడా టీమిండియా కాపాడుకోలేకపోయింది. కామెరూన్ గ్రీన్, మాథ్యూ వేడ్ చెలరేగి ఆడటంతో 4 వికెట్ల తేడాతో.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్య చేధనను ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సిక్సర్‌తో ప్రారంభించాడు. మరుసటి ఓవర్లో కామెరూన్ గ్రీన్ వరుసబెట్టి ఫోర్లు బాదాడు. ఫించ్‌ను ఔట్ చేయడం ద్వారా.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు.ఆ తర్వాత వచ్చిన స్మిత్, ఓపెనర్ కామెరూన్‌తో కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. దీంతో భారత జట్టు ఒత్తిడికి గురైంది. చాహల్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీగా ఔటయ్యే అవకాశం వచ్చింది. కానీ భారత ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడంతో అతడు బతికిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here