థాయిలాండ్ లో 13 మంది సజీవదహనం

0
13
thailand pub fire accident

థాయిలాండ్ లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కాగా.. 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తూర్పు థాయ్ చోన్బురి ప్రావిన్సుల్లోని సత్తాహిప్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజధాని బ్యాంకాక్ సమీపంలోని మౌంటెన్ బి అనే నైట్ క్లబ్లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక పోలీస్ అధికారి ఉట్టిపోంగ్ సోమ్జై తెలిపారు. ఇప్పటి వరకూ గుర్తించిన ప్రమాద మృతుల్లో విదేశీయులు ఎవరూ లేరని పేర్కొన్నారు. మృతులంతా థాయ్‌లాండ్ పౌరులేనని చెప్పారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఘనటపై థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చన్-ఓచా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు. వైద్యానికి పూర్తి బాధ్యత వహిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా వినోద, విహార కేంద్రాల్లో ప్రమాదాలను నివారించే భద్రతా చర్యలు చేపట్టాలని, అగ్ని ప్రమాద నివారణకు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here