దారితప్పిన ఉపగ్రహం.SSLV మిషన్ విఫలం

0
8

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చిట్టి ఉపగ్రహ వాహన నౌక SSLV మిషన్ విఫలమైంది. కొత్తగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహన నౌకను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రయోగం మూడు దశల్లో విజయవంతం అయింది. కానీ నాలుగో దశలో ఫెయిల్ అయింది. దానికి ఉద్దేశించిన గమ్యాన్ని చేరుకోలేకపోయింది.

సిగ్నల్ మిస్…
మూడు దశల్లో విజయవంతంగా ముందుకు సాగిన ఉపగ్రహం.. నాలుగో దశలో సిగ్నల్ మిస్సైంది. టెర్మినల్ దశలో కొంత డేటా నష్టం జరిగిందని ఇస్రో చైర్మన్ ఎస్‌.సోమనాథ్ తెలిపారు. అంతేకాదు ఉపగ్రహాన్ని తమకు కావలసిన కక్ష్యలోకి చొప్పించే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (VTM) టెర్మినల్ దశలో విఫలమైనట్టు తెలుస్తుంది. VTMలో 30 సెకన్ల పాటు మంటలు చెలరేగాల్సి ఉండగా ఒక్క సారి మాత్రమే మండింది.”SSLV తొలి విమానం పూర్తైంది. అన్ని దశలు ఊహించని విధంగా జరిగాయి. టెర్మినల్ దశలో డేటా నష్టం గమనించాం.” అని తొలుత ఇస్రో ప్రకటించింది. తర్వాత మిగతా సమాచారాన్ని విశ్లేషించి ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ధ్రువీకరించింది. చేపట్టి న మిషన్ అనుకున్న గమ్యాన్ని చేరుకోలేదు.

రూ.169 కోట్ల ప్రాజెక్ట్…
ఇక ఈ మిషన్ ప్రాజెక్ట్‌ అభివృద్ధికి కేంద్రం రూ.169 కోట్లు కేటాయించింది. అయితే ఈ మిషన్ వైఫల్యంపై సమీక్షించేందుకు ఇస్రో కమిటీని ఏర్పాటు చేయనుంది. “ఒక కమిటీ విశ్లేషించి సిఫారసు చేస్తుంది. ఆ సిఫారసుల అమలుతో త్వరలో SSLV-D2తో తిరిగి వస్తుంది.” అని ఇస్రో వెల్లడించింది. ఇక ఇస్రో ఇప్పటి వరకు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ ద్వారానే కక్ష్యలోకి పంపించేది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు తయారు చేసేందుకు 600 మందికి 70 రోజులు పట్టేది. చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు కేవలం 72 గంటల్లోనే రూపొందిస్తారు. దీని కోంస రూ.30 కోట్లు ఖర్చు అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here