దాసోజు శ్రవణ్‌ రాజీనామా

0
17
dashoju sravan

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత మాజీ మంత్రి పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె, టీఆర్ఎస్ కార్పోరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఇస్తామని పీసీసీ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తనకు టిక్కెట్ దక్కదన్న ఉద్దేశంతోనే దాసోజు శ్రవణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించారు. 2014లో అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేష్, పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పీసీసీ అధికార ప్రతినిధి హోదాను కల్పించి ప్రాధాన్యత ఇచ్చింది. 2018లో ఖైరతాబాద్‌లో పోటీచేసి ఓడిపోయిన ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలని క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే విజయారెడ్డి రాకతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక తర్వాత ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here