కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు గనిగుంట గ్రామంలో వడ్డివల్లి వంశస్థుల దేవర కొలుపులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు కందుకూరు నియోజకవర్గ టీడీపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వడ్డివల్లి కుటుంబీకులు భారీ సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు వడ్డివల్లి మాధవరావు, హరికృష్ణ, వెంకట్రావు, బత్తిన కోటేశ్వరరావు, నరసింహారావు, శ్రీను, నాయకులు మాదాల రవి, షేక్ సలాం, షేక్ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, కూనం నరేంద్ర తదితరులు హాజరయ్యారు.