దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు..కర్ణాటక CMకు కరోనా పాజిటివ్

0
14

India reports 19,406 fresh cases: దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 19,928 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది.

  • దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,34,65,552 కు చేరిందని వివరించింది. ప్రస్తుతం దేశంలో 1,34,793 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉందని పేర్కొంది.
  • కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 5,26,649 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న దేశ వ్యాప్తంగా 32,73,551 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,05,92,20,794కు చేరిందని తెలిపింది.
  • కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు ఇవాళ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసి వారందరూ ఐసోలేషన్‌లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. తాను ఢిల్లీకి వెళ్ళాల్సి ఉండగా కరోనా కారణంగా దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here