దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అర్హులైన ఖైదీలను విడుదల చేసే చర్యలలో భాగంగా ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి ఆధ్వర్యంలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. శ్యామ్ బాబుగారు, కందుకూరు మరియు చీరాల డివిజనల్ పోలీస్ అధికారులు, జిల్లా జైలు అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.